పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం..కారుపై ట్రాలీ బోల్తాపడటంతో ఆరుగురు మృతి
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ట్రాలీ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
By Knakam Karthik
పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం..కారుపై ట్రాలీ బోల్తాపడటంతో ఆరుగురు మృతి
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ట్రాలీ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.బికనీర్‌లోని దేశ్‌నోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కారులో మహిళ సహా ఆరుగురు వ్యక్తులు తమ బంధువుల వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. కారు దేశ్ నోక్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పక్కనే లోడ్ తో వెళుతున్న ఓ ట్రక్ కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి, కారుపై పడింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఘటనపై సమాచారం అందుకున్న దేశ్ నోక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు.
ఒక క్రేన్, మూడు జేసీబీల సహాయంతో ట్రాలీని తొలగించారు. కారు మొత్తం ట్రాలీలోని బూడిదతో నిండిపోయింది. కారులో ప్రమాదానికి గురైన వ్యక్తులను బయటికి తీసి, అంబులెన్స్ లో పీఎంబీ ఆసుపత్రికి తరలించారు. కానీ వారు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ వెల్లడించారు. ఘటనపై పోలీస్ అధికారి సునీల్ మాట్లాడుతూ.. కారులో ఓ మహిళ సహా ఆరుగురు వ్యక్తులు ఉన్నారని, వీరంతా మరణించినట్లుగా డాక్టర్ చెప్పారని తెలిపారు. చనిపోయిన వారు వివాహానికి హాజరై తిరిగి వస్తున్నట్లుగా గుర్తించామని, ప్రస్తుతానికి మృతులను గుర్తించలేదని, మృతదేహాలను పీఎంబీ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచామని చెప్పారు. ఇక ప్రమాద సమయంలో కారు బికనీర్ నుంచి నోఖా వైపు వెళుతుండగా.. ట్రాలీ బికనీర్ వైపు వస్తోందని తెలియజేశారు.
▶️राजस्थान में भीषण सड़क हादसा▶️कार के ऊपर पलटा ट्रेलर▶️कार में मौजूद लोग दबे▶️हादसे में 6 लोगों की मौत▶️पुलिस राहत-बचाव कार्य में जुटी▶️बीकानेर के देशनोक की घटना#Bikaner । #Rajasthan | #RoadAccident #bikaner pic.twitter.com/mMt4dLep2P
— Indianews64 (@INews64) March 20, 2025