శ్రీ రామ నవమి రోజున ద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై రైట్ వింగ్ యాక్టివిస్ట్ కాజల్ హిందుస్తానీని గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాజల్ ఆదివారం ఉదయం ఉనాలో పోలీసుల ముందు లొంగిపోయింది. ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఉనా పట్టణంలో శ్రీరామ నవమి రోజున విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ హిందూస్థానీ ఓ వర్గం మహిళలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కాజల్ హిందుస్తానీ జామ్‌నగర్ నివాసి. ఉనాలో జరిగిన కార్యక్రమంలో ఒక నిర్దిష్ట వర్గానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. కాజల్ హిందుస్తానీ ద్వేషపూరిత ప్రసంగానికి వ్యతిరేకంగానూ, అల్లర్లకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్ లను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాజల్ హిందుస్థానీ దిగువ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాజల్ హిందుస్థానీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం కాజల్ హిందుస్థానీని మేజిస్ట్రేట్ నివాసంలో ఆయన ముందు హాజరుపరిచిన తరువాత జునాగఢ్ జైలుకు తరలించారు.