ఆ యాత్రలో భాగమైన రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల
జనవరి 14, ఆదివారం మణిపూర్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో
By Medi Samrat Published on 14 Jan 2024 1:00 PM GMTజనవరి 14, ఆదివారం మణిపూర్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల భాగమయ్యారు. మొదటి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న తర్వాత రేవంత్ ఢిల్లీకి తిరిగి వెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దావోస్ వెళతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు దావోస్ వెళ్లనున్నారు.
'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మొత్తం 15 రాష్ట్రాలు, 100 లోక్‌సభ స్థానాలు.. 110 జిల్లాల మీదుగా సాగనుంది. 67 రోజులు పాటు 6,700 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుందని.. అలాగే 337 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని చెప్పింది.ఈశాన్య రాష్ట్రంలో మొదలవుతున్న రాహుల్‌గాంధీ యాత్ర మార్చి 20వ తేదీన మహారాష్ట్రలో ముగియనుంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఎక్కువ భాగం ఉత్తర్ ప్రదేశ్‌లో కొనసాగనుంది. యూపీలోని 20 జిల్లా మీదుగా 1,074 కిలోమీటర్ల మేర 11 రోజులు యాత్ర ఉంటుంది. జార్ఖండ్, అస్సాంలో 8 రోజలు, మధ్యప్రదేశ్‌లో 7 రోజుల పాటు భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగుతుంది.