నియోజకవర్గాల పెంపుపై ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్న.. కేంద్రం సమాధానం ఇదే..

Revanth Reddy Quotations About Assembly Constituency. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ

By Medi Samrat  Published on  3 Aug 2021 3:01 PM IST
నియోజకవర్గాల పెంపుపై ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్న.. కేంద్రం సమాధానం ఇదే..

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు. ఈ మేర‌కు.. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవస‌రం ఉంది. ఎప్పుడు పెంచుతారని లోక్‌స‌భ‌లో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు.

ఈ మేర‌కు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన.. 2031 తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఇక‌ నియోజక వర్గాల పునర్విభజన జరిగితే.. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజక వర్గాలను 225కు పెంచుతారు. అలాగే తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచుతారు.


Next Story