బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యాజమాన్యం తమ హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్‌ల స్థానంలో వాల్-మౌంటెడ్ ఫ్యాన్‌లను అమర్చడం ప్రారంభించింది. విద్యార్థులు డాబాలు, ఇరుకైన బాల్కనీలలోకి ప్రవేశించకుండా కూడా ఆంక్షలు విధించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకే ఈ చర్యను తీసుకున్నారు. ఇన్‌స్టిట్యూట్‌లోని నలుగురు విద్యార్థులు ఈ ఏడాది మార్చి నుంచి తమ హాస్టల్ గదుల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిలో ముగ్గురు ఉరివేసుకుని మరణించారు. విద్యార్థులు స్వీయ-హాని కలిగించే ఈ మార్గాలకు ప్రాప్యతను పరిమితం చేయడానికి కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విద్యార్థులు అంతర్గత పోల్ కూడా నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న 305 మందిలో 273 (88%) మంది తమ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌ను వాల్-మౌంటెడ్ ఫ్యాన్‌తో భర్తీ చేయకూడదని చెప్పారు. 14 మంది మార్పుకు అంగీకరించారు. 18 మంది అంగీకరించలేదు. ఫ్యాన్ల భర్తీ విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు దోహదపడుతుందని వారు భావిస్తున్నారా అనే రెండో ప్రశ్న కూడా వచ్చింది. దీనికి 267 మంది విద్యార్థులు నో అని, 19 మంది అవునని, 19 మంది విద్యార్థులు ఈ విషయంపై తమకు సరైన అభిప్రాయం లేదని చెప్పారు.
ఈ పోల్ ఆధారంగా విద్యార్థులు ఐఐఎస్‌సీ స్టూడెంట్స్ కౌన్సిల్ చైర్మన్‌కి మెయిల్ రాశారు. లేఖ ప్రకారం.. విద్యార్థులు సీలింగ్ ఫ్యాన్‌లను వాల్ మౌంటెడ్ ఫ్యాన్‌లతో భర్తీ చేయకూడదని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఇన్స్టిట్యూట్ విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఒక వెల్నెస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.