రైల్వే స్టేషన్‌లలో రిలాక్స్‌ జోన్‌.. అదిరిపోయే సౌకర్యాలు

Relax Zones In Railway Stations. రైల్వే ప్రయాణికులకు సరైన సదుపాయాలు అందించే దిశగా అడుగులు వేస్తోంది రైల్వే శాఖ. మెరుగైన

By Medi Samrat  Published on  13 March 2021 3:12 AM GMT
రైల్వే స్టేషన్‌లలో రిలాక్స్‌ జోన్‌.. అదిరిపోయే సౌకర్యాలు

రైల్వే ప్రయాణికులకు సరైన సదుపాయాలు అందించే దిశగా అడుగులు వేస్తోంది రైల్వే శాఖ. మెరుగైన సేవలను అందించేందుకు గాను మరో ప్రయోగం చేపట్టింది. రైల్వే స్టేషన్లలో రిలాక్స్‌ జోన్‌ ఏర్పాటు చేసింది. మొదటి ప్రయోగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఐల్యాండ్‌ ప్లాట్‌ఫామ్‌లో రిలాక్స్‌ జోన్‌ ప్రారంభించింది. దీంతో పాటు ఇతర స్టేషన్లలో కూడా ఇలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది రైల్వే శాఖ.

రిలాక్స్‌ జోన్‌ అంటే ఏమిటి..?

రైల్వే ప్రయాణికులు సేద తీరిందుకు గాను ఈ రిలాక్స్‌ జోన్‌ ఏర్పాటు చేస్తోంది. స్టేషన్‌లో కొన్ని గంటల ముందుగానే వచ్చిన ప్రయాణికులు, లేదా మరో రైలు ఎక్కేందుకు జంక్షన్‌లో దిగిన ప్రయాణికులు రిలాక్స్‌ జోన్‌లో సేద తీరేందుకు అవకాశం ఉంటుంది. రైల్వే స్టేషన్‌లలో రైలు కోసం ఎక్కువ సమయం కేటాయించేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

రిలాక్స్‌ జోన్‌లో సదుపాయాలు:

ఈ రిలాక్స్‌ జోన్‌లో అనేక సదుపాయాలున్నాయి. ఏసీ, రెస్ట్‌ ఏరియా, లెగ్‌ మసాజ్‌ చెయిర్‌, ఇంటర్నెట్‌, ప్రింట్‌ ఔట్‌, ఫోటో కాపీ సౌకర్యాలు కూడా ఉంటాయి. ట్రావెల్ డెస్క్‌, బిజినెస్‌ సెంటర్‌, మ్యూజిక్‌, డిస్టర్ట్‌ కౌంటర్స్‌, ప్యాక్‌ ఫుడ్‌ తదితర సదుపాయాలు ఈ రిలాక్స్‌ జోన్‌లో ఉన్నాయి. ఈ సౌకర్యం రైల్వే ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే అధకారులు చెబుతున్నారు. దేశంలో మరిన్ని ప్రధాన స్టేషన్లలో ఈ రిలాక్స్‌ జోన్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది. అయితే ఇది వరకే రైల్వే స్టేషన్‌లలో రిలాక్స్‌ అయ్యేందుకు ఇలాంటి జోన్‌లు ఉన్నా.. అందుకే పెద్దగా సౌకర్యాలేమి ఉండవు. కేవలం కాస్త రిలాక్స్‌ కావడం లేదా, రాత్రుల్లో నిద్రించేందుకు మాత్రమే ఉన్నాయి. తాజాగా ఏర్పాటు చేసిన రిలాక్స్‌ జోన్‌లో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఇలాంటి సౌకర్యాలతో అన్ని స్టేషన్‌లలో ఏర్పాటు చేయనుంది రైల్వే శాఖ.
Next Story
Share it