ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఇవాళ రామ్‌లీలా మైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలకు ముగుస్తుంది. భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని.. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు తమతమ సీట్లలలో ముందుగానే కూర్చోవాలని అధికార వర్గాలు ఆదేశించాయి. ఫంక్షన్‌కు వచ్చే అతిథులు ఉదయం 11 గంటలలోపు తమ సీట్లలో కూర్చోవాలని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథులు మధ్యాహ్నం 12 గంటలకు తమ సీట్లలో కూర్చుంటారని వెల్లడించారు.
తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాంలీలా మైదాన్ వెలుపల ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల పోస్టర్లు ఏర్పాటు చేశారు. సన్నాహాల అనంతరం వేదికను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలకు ముగుస్తుంది.