ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్..సీఎంగా రేఖ గుప్తా ప్రమాణస్వీకారం

దేశ రాజధానిలో కమలం సర్కార్ కొలువుదీరింది. ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

By Knakam Karthik  Published on  20 Feb 2025 1:04 PM IST
National News, Delhi CM Oath Ceremony, Rekha Gupta, Delhi, Bjp

ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్..సీఎంగా రేఖ గుప్తా ప్రమాణస్వీకారం

దేశ రాజధానిలో కమలం సర్కార్ కొలువుదీరింది. ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. అలాగే మంత్రులుగా ప‌ర్వేశ్ శ‌ర్మ‌, సాహిబ్ సింగ్‌, అశీశ్ సూద్‌, మంజీంద‌ర్ సింగ్‌, ర‌వీంద‌ర్ ఇంద్ర‌జ్ సింగ్, క‌పిల్ మిశ్రా, పంక‌జ్ కుమార్ సింగ్ ప్ర‌మాణం చేశారు. 27 సంవత్సరాల తర్వాత హస్తినలో పవర్‌లోకి వచ్చిన బీజేపీ.. ఈ ప్రోగ్రామ్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు.

Next Story