జూన్ నెల‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

Record GST Collection Rise In June 2023. జూన్ 2023లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయి. జూన్ 2023లో మొత్తం రూ.1,69,497 కోట్ల జీఎస్టీ వసూళ్లు

By Medi Samrat  Published on  1 July 2023 11:30 AM GMT
జూన్ నెల‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

జూన్ 2023లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయి. జూన్ 2023లో మొత్తం రూ.1,69,497 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది జూన్‌తో పోలిస్తే 12 శాతం పెరుగుదల నమోదైందని వెల్ల‌డించింది. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత.. జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం ఇది నాలుగోసారి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జీఎస్టీ 1 జూలై 2017 నుండి అమలులోకి వ‌చ్చింది.

2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల మొదటి త్రైమాసికంలో సగటు నెలవారీ జీఎస్టీ వసూళ్లు వరుసగా రూ. 1.10 లక్షల కోట్లు, 1.51 లక్షల కోట్లు, 1.69 లక్షల కోట్లు. జీఎస్టీ వసూళ్లు క్ర‌మంగా పెరుగుతున్నాయిని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

జూన్ 2023లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1,69,497 కోట్లు, ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.31,013 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.38,292 కోట్లు. కాగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,292 కోట్లుగా ఉంది. ఇందులో దిగుమతులపై జీఎస్టీ ద్వారా రూ.39,035 కోట్లు వచ్చాయి. సెస్ రూ.11,900 కోట్లు కూడా ఇందులో ఉన్నాయి.

2023 జూన్‌లో జీఎస్‌టీ ఆదాయం.. గత ఏడాది జూన్‌లో వచ్చిన జీఎస్‌టీ ఆదాయం కంటే 12 శాతం ఎక్కువ. అంతకుముందు ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. మే నెలలో ఇది 1.57 లక్షల కోట్లుగా ఉంది.


Next Story