పాత 500, 1000 నోట్లను మార్చుకునే అవకాశం ఇంకా ఉందా..?
RBI Should Consider Genuine Applications To Exchange Demonetised Notes Of Persons Who Missed Deadline. పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఇంకా అవకాశం ఉందనే అంటున్నారు.
పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఇంకా అవకాశం ఉందనే అంటున్నారు. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు వ్యాఖ్యలు చేసింది. పాత కరెన్సీ నోట్లను మార్చుకోవాలనుకునే వ్యక్తులు చేసిన దరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిగణనలోకి తీసుకోవాలని.. పాత నోట్లను మార్చుకునే గడువు ముగిసినా నోట్ల మార్పిడికి మరో అవకాశం ఇవ్వాలని ఆర్బీఐకి సూచించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేసింది. ఐదుగురు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, బి.ఆర్. గవాయి, ఎ.ఎస్. బోపన్న, వి. రామసుబ్రమణియన్, బి.వి. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయం చెల్లుబాటవుతుందనే విషయమై పరిశీలిస్తున్నారు. భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ నోట్ల రద్దు తేదీలను పొడిగించలేమని, అయితే రిజర్వ్ బ్యాంక్ కొన్ని వ్యక్తిగత కేసులను దరఖాస్తుదారులకు అవసరమైన షరతులకు లోబడి పరిగణిస్తుంది. దీనిపై కేంద్ర బ్యాంకు పరిశీలిస్తుందని అన్నారు.