డేరా బాబా బయటకు వచ్చాడు.. ఎందుకంటే..!

Rape convict Baba Ram Rahim granted parole to meet his ailing mother. డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌‌ అలియాజ్ డేరా బాబా బయటకు వచ్చాడు.

By Medi Samrat  Published on  21 May 2021 3:07 PM GMT
డేరా బాబా బయటకు వచ్చాడు.. ఎందుకంటే..!

డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌‌ అలియాజ్ డేరా బాబా బయటకు వచ్చాడు. అది కూడా పెరోల్ మీద బయటకు వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తల్లిని చూడాలని.. అందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ డేరా బాబా కోరాడు. అతడి అభ్యర్థనను మన్నించి.. పెరోల్ కు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

శుక్రవారం నాడు డేరా బాబాకు పెరోల్ మంజూరైంది. అస్వస్థతతో ఉన్న తన తల్లిని చూసేందుకు 21 రోజుల పెరోల్ కోరుతూ ఈనెల 17న ఆయన దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర పోలీసులు ఇందుకు అనుమతించారు. రోహ్‌తక్‌లోని సునరియా జైలు నుంచి శుక్రవారం ఉదయం డేరాబాబా పెరోల్‌పై విడుదలయ్యారు. ఆయన తల్లిని కలుసుకునేందుకు వీలుగా భారీ భద్రత మధ్య పోలీసులు రోహ్‌తక్ తీసుకువెళ్లారు.

ఆగష్టు 25, 2017న డేరా బాబాను అరెస్టు చేశారు. ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిని హత్య చేసిన ఆరోపణలపై డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అరెస్టు నుండి తప్పించుకోడానికి డేరా బాబా, అతడి అనుచరులు చేసిన విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఏకంగా విమానంలో వెళ్ళిపోదామని డేరా బాబా ప్రయత్నించాడు.. కానీ ఆ ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. 2002లో డేరా బాబాతో పాటు ఆయన ముగ్గురు అనుచరులైన కిషన్ లాల్, నిర్మల్ సింగ్, కుల్దీప్ సింగ్‌లు జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతిని చంపేశారు. ఈ కేసులో డేరాబాబాను దోషిగా కోర్టు తేల్చింది. ఆశ్రమంలోని మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై డేరాబాబా శిక్షను అనుభవిస్తున్నారు. డేరా బాబా ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆశ్రమం ముసుగులో ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు డేరా బాబా.


Next Story