ఆ ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయిన రానా
Rana Daggubati slams 'worst' airline Indigo on Twitter. నటుడు దగ్గుబాటి రానా ఇండిగో ఏయిర్ లైన్స్ పై రానా ఆగ్రహం వ్యక్తం చేశారు.
By M.S.R Published on 4 Dec 2022 7:00 PM ISTనటుడు దగ్గుబాటి రానా ఇండిగో ఏయిర్ లైన్స్ పై రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన లగేజ్ మిస్ అయిందని.. ఇండిగో ఏయిర్ లైన్స్ సిబ్బంది దాన్ని వెతికి పట్టుకోలేకపోయారని.. ఇండిగో ఏయిర్ లైన్స్ వల్ల అత్యంత చెత్త అనుభవం ఎదురైందని ట్విటర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. 'ఇండిగో విమాన సేవలు సరిగా లేవు. మిస్సైన లగేజ్ ట్రాకింగ్ కూడా సరిగా లేదు. లగేజ్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఉండదు. ఇక్కడి సిబ్బందికి కూడా సరైన సమాచారం ఉండదు' అని రానా ట్వీట్ చేశాడు. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లేందుకు రానా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెక్ ఇన్ అయ్యాక ఫ్లైట్ ఆలస్యమంటూ సిబ్బంది రానాకు సమాచారం ఇచ్చింది. మరో విమానంలో వెళ్లాల్సిందిగా కోరారు. లగేజ్ కూడా అదే విమానంలో పంపిస్తామని చెప్పారు. బెంగళూరు చేరుకున్నాక కూడా లగేజ్ రాకపోవడంతో రానా అసహనం వ్యక్తం చేశారు.
వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ కు వెళ్లిన పేసర్ దీపక్ చాహర్‌కు కూడా విమానయాన సంస్థ ద్వారా చేదు అనుభవం ఎదురైంది. మలేషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దీపక్ చాహర్ లగేజ్ ఢాకాకు రాలేదు. దీంతో చాహర్ మలేషియా ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నేను ఇప్పటి వరకు ఇంత చెత్త సర్వీస్‌ను చూడలేదంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించినప్పటికీ.. ఎటువంటి ఆహారం కూడా ఇవ్వలేదని ఆరోపించాడు.