పతంజలి కరోనిల్‌ ఔషధానికి డబ్ల్యూహెచ్‌వో, భార‌త ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Ramdev Claims Patanjali's 'Coronil' For Covid Cleared, Can Be Exported. పతంజలి నుంచి వచ్చిన కరోనిల్‌ ఔషధంపై ఎట్టకేలకు

By Medi Samrat  Published on  20 Feb 2021 5:31 AM GMT
పతంజలి కరోనిల్‌ ఔషధానికి డబ్ల్యూహెచ్‌వో, భార‌త ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

పతంజలి నుంచి వచ్చిన కరోనిల్‌ ఔషధంపై ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. కరోనా కోసం ఉత్పత్తి చేసిన కరోనిల్‌ ఔషధం వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ ఔషధంపై ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నట్లు పతంజలి ఆయుర్వేద్‌ ప్రకటించింది. 158 దేశాలకు చెందిన ఔషధమై దివ్య కరోనిల్‌ టాబ్లాట్‌ , దివ్య శ్వాసరి ఎగుమతి చేయడానికి అనుమతిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఔషధ ఉత్పత్తుల కోసం అనుమతి లభించినట్లు వెల్లడించారు.

ఈ సందర్బంగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోవిడ్-19కు పతంజలి రూపొందించిన 'ఎవిడెన్స్ బేస్ట్ మెడిసెన్' పరిశోధనా పత్రాన్ని రామ్‌దేవ్ బాబా ఢిల్లీలో విడుదల చేశారు. ఈ కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, మంత్రి నితిన్ గడ్కరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఔషధ ఉత్పత్తి, దాని ఉత్పత్తిదారు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అర్హులని నిర్ధారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన ఫార్మాట్‌లో జారీ చేసిన సర్టిఫికేట్‌ గురించి రాందేవ్‌ బాబా వెల్లడించారు. కరోనిల్‌ కరోనా కోసం తొలి సహాయక మందు అని పేర్కొన్నారు. అయితే పతంజలి సంస్థ గత సంవత్సరం జూన్‌లో కరోనిల్‌ అనే ఔషధంతో సహా మూడు ఉత్పత్తులతో కూడిన కోవిడ్‌ కిట్‌ను ప్రారంభించారు. మొదట్లో కరోనా వైరస్‌కు దీనిని 'నివారణ'గా అభివర్ణించారు. అయితే ఆ తర్వాత ఈ కరోనిల్‌ ఔషధం పలు వివాదాల్లో చిక్కుకుంది. ఔషధానికి సంబంధించి పూర్తి వివరాలు సరిగా లేవని ఫిర్యాదులు రావడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. పతంజలి ఉత్పత్తి తన వాదనకు మద్దతు ఇవ్వడానికి సరైన క్లినికల్‌ ట్రయల్‌ డేటా లేకపోవడంతో దగ్గు, జ్వరం, రోగనిరోధక శక్తిని పెంచే ఔషధంగా విక్రయించడానికి అనుమతి కోరిందనే దానిపై వివాదం నెలకొంది. 2020 డిసెంబర్‌లో హరిద్వార్‌ ఆధారిత సంస్థ ఆయుష్‌ మంత్రిత్వశాఖతో కరోనిల్‌ టాబ్లెట్ల కోసం ఆయుష్‌ లైసెన్స్‌ను రోగ నిరోధక శక్తిని పెంచే కోవిడ్‌-19కు ఉపయోగించే ఔషధానికి అప్‌డేట్‌ చేయమని కోరింది.

అయితే ఈ ప్రతిపాదనను ఆయుష్‌ మంత్రిత్వ శాఖ కంపెనీకి జారీ చేసి పతంజలి ఆయుర్వేదం తన బుక్‌లెట్‌లో ప్రచురించి లేఖ ప్రకారం డాక్టర్‌ ఎస్‌.కె మౌలిక్‌, మాజీ ప్రొఫెసర్‌, ఫార్మకాలజీ విభాగం, ఎయిమ్స్‌, తువి, అశ్వగంధ వంటి ప్రధాన పదార్థాలు కోవిడ్‌-19 కొరకు నేషనల్‌ క్లినికల్‌ ప్రోటోకాల్‌లో చేర్చబడ్డాయి. దీనిని కోవిడ్‌లో సహాయక మెడిసిన్‌గా ఉపయోగించవచ్చని సూచించిందని పతంజలి తెలిపింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన లేఖ ప్రకారం కరోనిల్ ఔషధాన్ని కరోనా నివారణ మందుగా కాకుండా సహాయక చికిత్సగా మాత్రమే ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు.

కరోనిల్‌ ఇమ్యూనిటీని పెంచుతుంది: రాందేవ్‌ బాబా

కరోనిల్‌ ఔషధం శరీరంలో ఇమ్యూనిటీని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాందేవ్‌ బాబా అన్నారు. కరోనాను అదుపులో ఉంచేందుకు సమర్ధవంతంగా పని చేస్తుందని పేర్కన్నారు. తమ ఔషధానికి భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు.

150 దేశాలకుపైగా సరఫరా చేసేందుకు సిద్దం

కాగా, పతంజలి నుంచి వచ్చిన ఈ కరోనిల్‌ ఔషధాన్ని 150 దేశాలకుపైగా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని రాందేవ్ బాబా తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రీయ పరిశోధనలు పూర్తి చేసిన తర్వాతే కరోనిల్‌ ఔషధానికి అనుమతులు లభించాయని అన్నారు. ఈ ఔషధం రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా కరోనాను అదుపులో ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎన్నిఆటంకాలు ఎదురైనా చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.


Next Story
Share it