'ఫడ్నవీస్' 4 అడుగులు వెనక్కి వేసినట్లుగానే.. 'షిండే' 2 మెట్లు కింద‌కి దిగాలి

మహారాష్ట్రలో సీఎం అభ్య‌ర్ధిపై కేంద్ర మంత్రి, రాందాస్ అథవాలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు

By Medi Samrat  Published on  26 Nov 2024 2:10 PM IST
ఫడ్నవీస్ 4 అడుగులు వెనక్కి వేసినట్లుగానే.. షిండే 2 మెట్లు కింద‌కి దిగాలి

మహారాష్ట్రలో సీఎం అభ్య‌ర్ధిపై కేంద్ర మంత్రి, రాందాస్ అథవాలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "మహారాష్ట్ర వివాదం త్వరలో ముగియాలి.. దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.. అయితే ఏక్నాథ్ షిండే అసంతృప్తితో ఉన్నారు. ఆయ‌న‌ అసంతృప్తిని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీకి సీట్లు ఉన్నాయి కాబ‌ట్టి బీజేపీ కూడా ఒప్పుకోదన్నారు.

దేవేంద్ర ఫడ్నవీస్ 4 అడుగులు వెనక్కి వేసినట్లుగా ఏకనాథ్ షిండే 2 అడుగులు వెనక్కి వేయాలని నేను భావిస్తున్నాను. ఫడ్నవీస్ నాయకత్వంలో ఏక్నాథ్ షిండే పనిచేయాలన్నారు. ఒక కేంద్ర మంత్రిగా PM మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విష‌యాల‌పై ఖచ్చితంగా ఆలోచిస్తాం. అయితే.. త్వరగా కొన్ని నిర్ణయాలు తీసుకోండని బీజేపీ అధిష్టానానికి సూచించారు. ఏక్‌నాథ్ షిండే, ఆయన 57 మంది ఎమ్మెల్యేలు మాకు చాలా అవసరం.. త్వరలో ఒప్పందం కుదుర్చుకుని, అత్యంత విశ్వాసంతో మంత్రివర్గాన్ని విస్తరించాలి.. కానీ ఆ క్యాబినెట్‌లో నా పార్టీకి మంత్రి పదవి ఇవ్వాలి.. దేవేంద్ర ఫడ్నవీస్ ముందు నేను అదే డిమాండ్ ఉంచాను అని పేర్కొన్నారు.

Next Story