సోమవారం నాడు కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో రైతు నేతలు రాకేష్ టికాయత్, యుధ్వీర్ సింగ్‌లపై నల్ల ఇంకు విసిరారు. కర్నాటక రైతు నాయకుడు కోడిహళ్లి చంద్రశేఖర్ డబ్బులు అడగ్గా పట్టుబడిన ఓ ప్రాంతీయ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ వీడియోపై క్లారిటీ ఇస్తుండగా రాకేష్ టికాయత్, యుధ్వీర్ సింగ్ లపై ఇంక్ విసిరారు. రాకేశ్, యుధ్‌వీర్‌లు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఇందులో తమ ప్రమేయం లేదని, రైతు నాయకుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
విలేకరుల సమావేశంలో కొంత మంది వాగ్వాదానికి దిగి వారిపై నల్ల ఇంకు విసిరి కుర్చీలు కూడా విసిరారు. చంద్రశేఖర్ మద్దతుదారులు సిరా విసిరారని రాకేష్ టికాయత్, యుధ్వీర్ సింగ్ భావిస్తూ ఉన్నారు. రాకేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై స్థానిక పోలీసులే బాధ్యత వహించాలని ఆరోపించారు. తమకు అసలు భద్రత లేదని, ఈ నిరసనలకు కర్ణాటక ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు.