సోనియా గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌

Rajya Sabha Chairman protests Sonia Gandhi's statement. పార్లమెంట్ శీతాకాల సమావేశల్లో భాగంగా డిసెంబరు 21న సోనియా గాంధీ లోక్‭సభలో

By Medi Samrat  Published on  23 Dec 2022 2:00 PM GMT
సోనియా గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌

పార్లమెంట్ శీతాకాల సమావేశల్లో భాగంగా డిసెంబరు 21న సోనియా గాంధీ లోక్‭సభలో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. మంత్రులు, ఓ అత్యున్నత స్థాయి రాజ్యాంగబద్ధ అధికారి వివిధ కారణాలను చూపుతూ న్యాయ వ్యవస్థపై దాడి చేస్తూ ప్రసంగించేందుకు ఉద్యుక్తులయ్యారని.. ఇవి చాలా భయానకమైన పరిస్థితులని అన్నారు. ప్రజల దృష్టిలో న్యాయ వ్యవస్థ విలువను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ సోనియా ఆరోపించారు. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాజ్యసభ చైర్మన్ (ఉపరాష్ట్రపతి) జగదీప్ ధన్‌కర్‌ స్పందించారు. సోనియా వ్యాఖ్యలపై ధన్‌కర్‌ మాట్లాడుతూ.. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ వ్యాఖ్యలు సరికాదని.. అత్యున్నత స్థాయి రాజ్యాంగ పదవులను నిర్వహించేవారిని పక్షపాత వైఖరులకు ఆపాదించవద్దని అన్నారు. న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని తగ్గించడమనేది తన ఆలోచనకు అతీతమైందని అన్నారు. న్యాయ వ్యవస్థపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించకపోతే తాను తన ప్రమాణాన్ని తిరస్కరించినట్లు అయి ఉండేదని అన్నారు. తనకున్న రాజ్యాంగపరమైన బాధ్యతను నిర్వహించడంలో విఫలమైనట్లేనని జగదీప్ ధన్‌కర్‌ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.


Next Story