రజనీకాంత్ సంచలన ప్రకటన.. రాజకీయాలలోకి రావడం లేదు
Rajinikanth says will not start a political party. సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయ పార్టీని
By Medi Samrat Published on 29 Dec 2020 12:42 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయ పార్టీని పెట్టే ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతానికి పార్టీ పెట్టట్లేదని తలైవా స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మూడు పేజీల లేఖను విడుదల చేశారు. "రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా. కానీ ఇప్పుడు కాదు. అనారోగ్య కారణాల దృష్ట్యా నూతన పార్టీ ఆలోచనను తాత్కాలికంగా విరమించుకున్నా" అని రజినీ ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ కోసం ఎదురు చూసిన అభిమానులందరికీ క్షమాపణ చెపుతున్నానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను రోడ్డు మీదకు వస్తే.. అది తన ఆరోగ్యానికే ముప్పుగా మారే అవకాశం ఉందన్నారు.
— Rajinikanth (@rajinikanth) December 29, 2020
వాస్తవానికి ఈ నెల 31న కొత్త పార్టీని ప్రకటించనున్నామని రజనీ తెలిపారు. ఈ క్రమంలోనే అన్నాత్తే సినిమా త్వరగా పూర్తి చేయాలని బావించారు. అందుకోసం రోజుకు 14 గంటల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన శారీరక, మానసిక ఒత్తిడికి లోనయ్యారు. దీంతో.. ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. శరీరంలో బీపీ లెవల్స్ హెచ్చుతగ్గులు కావడంతో హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడ్డాక చెన్నై వెళ్లారు. వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడికి గురయ్యే పనులను దూరంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దీంతో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న రజనీ చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.