రజనీ.. రాజకీయాల్లోకి వచ్చేనా..!

Rajinikanth reignites expectations about his political entry. రజనీకాంత్.. త్వరలోనే పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 'అనారోగ్య

By Medi Samrat  Published on  12 July 2021 7:21 AM GMT
రజనీ.. రాజకీయాల్లోకి వచ్చేనా..!

రజనీకాంత్.. త్వరలోనే పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 'అనారోగ్య కారణాలతో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే నేను రాజకీయాల్లోకి రావాలని చాలామంది అడుతున్నారు. అభిమానులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటా' అని రజనీకాంత్‌ తాజాగా ట్విట్టర్ లో స్పష్టం చేశారు. మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్ లతో సమావేశం కానున్న నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్నదానిపై చర్చిస్తానని రజనీకాంత్ తాజాగా చెప్పడంతో.. ఆయన పొలిటికల్ జర్నీ పై మరోమారు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రజనీకాంత్ ని పాలిటిక్స్ లోకి రావాలని చాలామంది అడిగిన నేపథ్యంలో తాజాగా మరోమారు ఆయన అభిమానులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది .

గతేడాది రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన రజనీకాంత్‌ చివరి నిమిషంలో అనారోగ్య సమస్యలు ఎదురు కావడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వైద్య ప‌రీక్ష‌ల కోసం అమెరికా వెళ్లిన ఆయన ఇటీవలె చెన్నై చేరుకున్నారు. ఈ క్రమంలో జులై 12న జరగనున్న సమావేశానికి హాజరుకావలంటూ తన అభిమాన సంఘానికి ఆహ్వానం పంపడంతో రజనీకాంత్ పొలిటికల్‌ ఎంట్రీపై ఊహాగానాలు మరోసారి ఊపందకున్నాయి. అభిమానులతో చర్చించి త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని రజనీ ప్రకటించారు. రజనీకాంత్ మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్ లతో నేడు సమావేశం నిర్వహించడం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు. ఇక అభిమాన సంఘాల నాయకులు సైతం ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. రజనీ ఏమి చెబుతారా అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతూ ఉంది.


Next Story
Share it