రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఆగస్టు 2- 3 తేదీల్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టారు. కేవలం రెండు రోజుల్లోనే 25 కి పైగా కుక్కలను కాల్చి చంపాడు. దుమ్రా నివాసి అయిన షియోచంద్ బవేరియా అనే నిందితుడు గ్రామంలో తిరుగుతూ, వీధి కుక్కలు కనిపించగానే కాల్చి చంపుతున్నట్లు వైరల్ వీడియోలో కనిపించింది. దీన్ని చూసి ప్రజలు ఉలిక్కిపడ్డారు.
గ్రామ వీధులు, పొలాల్లో చెల్లాచెదురుగా రక్తంతో తడిసిన కుక్కల మృతదేహాలను చూపించే ఫుటేజ్ గ్రామస్తులలోనూ, జంతు ప్రేమికులలోనూ ఆగ్రహాన్ని రేకెత్తించింది. భయాందోళనకు గురై ప్రాణాల కోసం పారిపోతున్న కుక్కలు ఆ వీడియో లో చూడొచ్చు. నిందితుడు షియోచంద్ బవేరియా గ్రామంలో బహిరంగంగా తిరుగుతూ వీధి కుక్కలను వెంబడించి కాల్చి చంపడాన్ని చిత్రీకరించారు. ఇది సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆగస్టు 4న దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ్ ధృవీకరించారు. బవేరియాపై భారత శిక్షాస్మృతి, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.