రైలులో అగ్ని ప్రమాదం.. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం

Railways to conduct high-level inquiry into train fire incident in Bihar. బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో శనివారం మంటలు చెలరేగిన వెంటనే,

By అంజి  Published on  19 Feb 2022 7:58 AM
రైలులో అగ్ని ప్రమాదం.. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం

బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో శనివారం మంటలు చెలరేగిన వెంటనే, ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని తూర్పు మధ్య రైల్వే తెలిపింది. ఈసీఆర్‌ ప్రకటన ప్రకారం.. ఈ రోజు ఉదయం 9.13 గంటలకు మంటలు చెలరేగగా, 9.50 గంటలకు మంటలను ఆర్పివేశారు. జైనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదు కోచ్‌లలో మంటలు చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, రైల్వే ప్రకారం, రైలులోని ఒక కోచ్‌లో మాత్రమే మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ఈసీఆర్‌కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు/రైలు రక్షణ దళం దర్యాప్తు చేస్తోంది. దీనిని రైల్వే అడ్మినిస్ట్రేషన్ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఉన్నత స్థాయి విచారణ నిర్వహిస్తుంది" అని ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Next Story