భారీగా నష్టపోయిన ఇండియన్ రైల్వేస్..!

Railways Suffered Rs 36,000 Crore Loss During Pandemic. భారతీయ రైల్వే.. ప్రతి రోజూ లక్షల మందిని గమ్య స్థానాలకు చేరుస్తూ ఉండేది..!

By Medi Samrat  Published on  23 Aug 2021 4:39 AM GMT
భారీగా నష్టపోయిన ఇండియన్ రైల్వేస్..!

భారతీయ రైల్వే.. ప్రతి రోజూ లక్షల మందిని గమ్య స్థానాలకు చేరుస్తూ ఉండేది..! కానీ కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. రైళ్లను కనీసం నడపలేని పరిస్థితి. కొన్ని స్పెషల్ ట్రైన్స్ మినహా.. కొన్ని నెలల పాటూ ఎటువంటి ట్రైన్స్ ను భారతీయ రైల్వే నడపలేకపోయింది. ఆదాయాన్ని అందించే గూడ్స్ ల విషయంలో కూడా వ్యాపారాలు లేకపోవడంతో అంతంత మాత్రంగానే సాగింది. రైళ్లు ఉన్న మార్గాల్లోనూ ప్రయాణికులు లేక ఖాళీగానే నడిచాయి. దాంతో రైల్వేకు తీవ్ర నష్టం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా నష్టాలను చవి చూసింది.

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల రైల్వేల‌కు రూ.36 వేల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని తాజాగా రైల్వేశాఖ స‌హాయ మంత్రి రావు సాహెబ్ ద‌న్వే చెప్పారు. భార‌తీయ రైల్వేల‌కు గూడ్స్ రైళ్ల‌తోనే నిజమైన ఆదాయం వ‌స్తుంద‌ని అన్నారు. ఆదివారం ఆయ‌న మ‌హారాష్ట్ర‌లోని జ‌ల్నా రైల్వేస్టేష‌న్ వ‌ద్ద అండ‌ర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ప్యాసింజ‌ర్ రైళ్ల విభాగం ఎల్ల‌వేళ‌లా న‌ష్టాల్లోనే న‌డుస్తుంది. ప్ర‌యాణ టికెట్ల ధ‌ర‌లు పెంచితే ప్యాసింజ‌ర్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది.. మేం ఆ ప‌ని చేయ‌లేం. క‌రోనా వ‌ల్ల రైల్వేల‌కు రూ.36 వేల కోట్ల న‌ష్టం వాటిల్లింది అని అన్నారు. కరోనా సమయంలో గూడ్స్‌ రైళ్లు ప్రధాన పాత్ర పోషించాయని.. ప్రజలకు సరుకు రవాణాలో ఎంతో దోహదపడ్డాయని రావు సాహెబ్ ధన్వే తెలిపారు. రైల్వేకు నిజమైన ఆదాయ వనరులుగా గూడ్స్‌ రైళ్లు నిలిచాయని అన్నారు. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేతోపాటు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ త్వ‌ర‌లో ప్రారంభం అవుతుంద‌న్నారు.


Next Story