ఆ టికెట్ల రేట్లను భారీగా తగ్గించిన భారతీయ రైల్వే

Railways Reduce Price of Platform Tickets from Rs 50 to Rs 10. రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధరను తగ్గిస్తూ భారతీయ

By Medi Samrat  Published on  26 Nov 2021 12:42 PM GMT
ఆ టికెట్ల రేట్లను భారీగా తగ్గించిన భారతీయ రైల్వే

రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధరను తగ్గిస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో ప్లాట్‌ఫారమ్ టికెట్ మునుపటిలా రూ.10 కానుంది. సెంట్రల్ రైల్వే బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT), థానే, కళ్యాణ్ మరియు పన్వెల్ స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధరలను తగ్గించింది. సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ ప్రకారం, CSMT, దాదర్, LTT, థానే, కళ్యాణ్ మరియు పన్వెల్ స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల ధరను రూ. 50 నుంచి రూ.10 గా చేరింది. సెంట్రల్ రైల్వే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధరలను తగ్గించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ రేట్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది.

ఇక రైల్వే శాఖ ఇటీవలే "భారత్ గౌరవ్ స్కీమ్" అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు రైల్వేస్ నుంచి రైళ్లను లీజుకు తీసుకోవచ్చు. ఈ రైళ్లను తమకు నచ్చిన సర్క్యూట్‌లో నడపవచ్చు. ప్రైవేట్ ఆపరేటర్లకు రూట్‌లు, ఛార్జీలు, సేవల నాణ్యతను నిర్ణయించుకునే స్వేచ్ఛ సైతం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్లు రైల్వేలకు చెందిన మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే హక్కు లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఏదైనా సంస్థ, ప్రైవేటు వ్యక్తులు ఈ రైళ్లను నడపవచ్చు.

రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌ సహా అన్ని ప్రీమియం రైళ్లలో వండిన ఆహారాన్ని అందించే క్యాటరింగ్ సేవలను కూడా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అన్ని శాఖలు, విభాగాలకు ఇప్పటికే ఆర్డర్ జారీ అయ్యాయి. రైలు ప్రయాణాలతో పాటు దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర ప్రదేశాలలో కోవిడ్ లాక్‌డౌన్ పరిమితులను సడలించిన నేపథ్యంలో ప్రీమియం రైళ్లలో ఆహారాన్ని అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టికెట్ బుకింగ్ సమయంలోనే ఫుడ్ క్యాటరింగ్ ఆప్షన్‌ను ప్రయాణికులు ఎంచుకునే వీలుంటుంది. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సైతం సేవలందించేందుకు రైల్వే ఏర్పాట్లు చేసింది. క్యాటరింగ్ సర్వీస్‌ను తిరిగి ప్రారంభించే తేదీపై ప్రకటన రావాల్సి ఉంది.


Next Story