రైలు ప్రయాణికులకు శుభవార్త.. e సేవలను మళ్లీ ప్రారంభించిన రైల్వే శాఖ
Railway Starts E Services. రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. UTS ON MOBILE యాప్‌లో రైలు టికెట్లు
By Medi Samrat Published on 27 Feb 2021 6:57 AM GMTరైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. UTS ON MOBILE యాప్‌లో రైలు టికెట్లు బుకింగ్‌ను మళ్లీ ప్రారంభించింది. అన్ని జోన్లలో సేవలు పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్లను బుక్ చేయడం కోసం యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ రూపొందించిన విషయం తెలిసిందే. రైల్వే కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడి టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్లను ఈ యాప్‌లో సులభంగా తీసుకోవచ్చు.
అయితే గత ఏడాది మార్చిలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రైల్వే సేవలు నిలిచిపోయాయి. దీంతో యూటీఎస్ అన్ మొబైల్ యాప్‌లో రైలు టికెట్ల బుకింగ్ కూడా నిలిచిపోయింది. ఆ తర్వాత భారతీయ రైల్వే దశల వారీగా రైళ్లను పునరుద్దరించింది. స్పెషల్ ట్రైన్‌ని విడతల వారీగా ప్రకటించిన రైల్వే శాఖ.. ప్యాసింజర్ రైళ్లను కూడా పునరుద్దరిస్తోంది. దీంతో రైల్వే కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించుకునేందుకు మళ్లీ UTS ON MOBILE యాప్ ద్వారా రైలు టికెట్లను బుకింగ్ ప్రారంభిస్తోంది. భారతీయ దశల వారీగా అన్‌రిజర్వ్‌డ్ రైలు సేవలను ప్రారంభించనుంది. ఈ రైళ్లల్లో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఈ యాప్‌లో రైలు టికకెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సబ్ అర్బన్ ప్రాంతాల్లో ఈ యాప్ పని చేస్తుంది. త్వరలో అన్ని రైల్వేజోన్లలో నాన్ సబ్ అర్బన్ ప్రాంతాల్లో కూడా యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ సేవలు ప్రారంభం కానున్నాయి.
ఉదాహారణకు ప్రయాణికులు ప్యాసింజర్ రైలులో సికింద్రాబాద్ నుంచి ఇంకెక్కడికైనా వెళ్లాలనుకుంటే స్లీపర్, ఏసీ కోచ్‌లలో టికెట్ ముందే బుక్ చేసుకుంటే అది రిజర్వ్‌డ్ టికెట్ అవుతుంది. రిజర్వేషన్ కాకుండా రైలు కౌంటర్‌లో జనరల్ టికెట్ తీసుకుంటే అది అన్‌రిజర్వ్‌డ్ టికెట్. సాధారణంగా జనరల్ టికెట్ల కోసం క్యూలో నిలబడక తప్పదు. కానీ ఈ యాప్‌లో టికెట్ బుక్ చేసుకుంటే క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. సులభంగా టికెట్లు తీసుకునే సదుపాయం ఉంటుంది. ఇప్పటికే ఈ యాప్‌ను చాలా మంది ఉపయోగిస్తుండగా, కరోనా నేపథ్యంలో ఈ సేవలను నిలిపివేసింది. ప్రస్తుతం ఈ సేవలను మళ్లీ పునరుద్దరించింది.