రైల్వే మంత్రిత్వ శాఖ మంచి నీటి బాటిల్ ధరను తగ్గించింది. తాగునీటి బాటిళ్ల గరిష్ట చిల్లర ధరను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ ధరలు రైల్వే స్టేషన్లు, రైళ్లలో అమ్మకానికి వర్తిస్తాయి. ఇంతకు ముందు రైల్ నీర్ వాటర్ బాటిల్ ధర 15 రూపాయలు ఉండగా.. ఇప్పుడు దానిని 14 రూపాయలుగా మార్చింది. అర లీటర్ బాటిల్ ధరను రూ.10 నుంచి రూ.9కి తగ్గించినట్లు తెలిపింది. రైల్ నీర్ అనేది ప్రభుత్వ నియంత్రణలో ఐఆర్‌సీటీసీ ద్వారా సరఫరా అవుతోంది.
రైల్ నీర్ కాకుండా, రైల్వే ప్రాంగణాలు/రైళ్లలో విక్రయించే ఇతర బ్రాండ్లకు చెందిన IRCTC/రైల్వేస్ షార్ట్‌లిస్ట్ చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల గరిష్ట రిటైల్ ధరను కూడా లీటరు బాటిల్‌కు ₹15/- నుండి ₹14/-కి, 500 ml సామర్థ్యం గల బాటిల్‌కు 10/- నుండి ₹9/-కి సవరించనున్నారు. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి వర్తిస్తాయి.