Viral Video : క్లియరెన్స్ రాలేదు.. అరగంట పాటు హెలికాప్టర్‌లోనే కూర్చున్న‌ రాహుల్ గాంధీ..!

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హెలికాప్టర్ జార్ఖండ్‌లోని గొడ్డాలో ఇరుక్కుపోయింది. వార్తా సంస్థ PTI ప్రకారం.. ATC నుండి క్లియరెన్స్ లేకపోవడంతో రాహుల్ హెలికాప్టర్ అరగంట పాటు గొడ్డాలో నిలిచిపోయింది.

By Medi Samrat  Published on  15 Nov 2024 10:36 AM GMT
Viral Video : క్లియరెన్స్ రాలేదు.. అరగంట పాటు హెలికాప్టర్‌లోనే కూర్చున్న‌ రాహుల్ గాంధీ..!

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హెలికాప్టర్ జార్ఖండ్‌లోని గొడ్డాలో ఇరుక్కుపోయింది. వార్తా సంస్థ PTI ప్రకారం.. ATC నుండి క్లియరెన్స్ లేకపోవడంతో రాహుల్ హెలికాప్టర్ అరగంట పాటు గొడ్డాలో నిలిచిపోయింది. ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న‌ కారణంగానే రాహుల్‌ హెలికాప్టర్‌కు క్లియరెన్స్‌ రాలేదని కాంగ్రెస్‌ ఆరోపించింది.

గొడ్డాలోని మహాగామా అసెంబ్లీ నియోజకవర్గంలోని బల్బడ్డా హైస్కూల్ గ్రౌండ్‌లో రాహుల్ గాంధీ సమావేశం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను సభా వేదిక వద్ద నిలిపివేశారు. దీంతో హాజ‌రైన ప్ర‌జానీకం కాసేపు రాహుల్‌కు మ‌ద్ద‌తుగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను కేంద్ర ఏజెన్సీలు ఆపడంపై మహాగామా కాంగ్రెస్ అభ్యర్థి దీపికా పాండే సింగ్ తీవ్రంగా విమర్శించారు.

ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో కూర్చొని గొడ్డా నుంచి వెళ్లేందుకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీకి రక్షణగా హెలిప్యాడ్ చుట్టూ పలువురు ర‌క్ష‌ణ సిబ్బంది నిలబడి ఉన్నారు.

మహాగామా నియోజకవర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి దీపికా పాండే సింగ్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని దేవ్‌గఢ్‌లో ఉన్నందునే రాహుల్‌గాంధీ హెలికాప్టర్‌ను నిలిపివేశారని అన్నారు. రాహుల్ గాంధీని ఆ ప్రాంతం గుండా వెళ్లనివ్వలేదు. మనకు అర్థమయ్యే ప్రోటోకాల్ ఉంది కానీ కాంగ్రెస్ 70 ఏళ్లు దేశాన్ని పాలించింది.. అలాంటి సంఘటన ఏ ప్రతిపక్ష నాయకుడికీ జరగలేదు. ఇది ఆమోదయోగ్యం కాదని ఫైర్ అయ్యారు.

Next Story