వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. తన నివాసం నుంచి పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మీదనే వచ్చిన రాహుల్ గాంధీ.. వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ట్రాక్టర్‌కు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ హోర్డింగులు కట్టారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు.. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీతో కలిసి ట్రాక్టర్ మీద పార్లమెంట్‌కు వచ్చినవారిలో కాంగ్రెస్ నేతలు రణదీప్ సుర్జేవాలా, దీపెందర్ హుడా, అనేక ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ.. రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నారు. గత 8 నెలలుగా వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారు. రైతుల నిరసనపై ఈ పార్లమెంట్ సమావేశాలలో కాంగ్రెస్ నేతలు.. అధికార బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.