Video : రాహుల్‌ను ఇంటికి ఆహ్వానించింది.. తీరా వ‌చ్చాక తాళాలు దొర‌క‌క‌..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలోని కెవెంటర్స్ స్టోర్‌ను సందర్శించారు.

By Medi Samrat  Published on  10 Jan 2025 3:58 PM IST
Video : రాహుల్‌ను ఇంటికి ఆహ్వానించింది.. తీరా వ‌చ్చాక తాళాలు దొర‌క‌క‌..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలోని కెవెంటర్స్ స్టోర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా దుకాణానికి వచ్చిన కస్టమర్‌లతో మాట్లాడి అక్కడ కోల్డ్ కాఫీ కూడా తయారు చేశారు. రాహుల్ గాంధీ కెవెంటర్స్ సహ వ్యవస్థాపకులతో వారి వ్యాపారం, సవాళ్లు, భవిష్యత్తు ప్రణాళిక గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశారు.

రాహుల్ గాంధీ పోస్ట్‌లో "పాత కంపెనీని కొత్త తరం, కొత్త మార్కెట్ కోసం ఎలా సిద్ధం చేయవచ్చు? కెవెంటర్స్ యువ వ్యవస్థాపకుడు ఇటీవల నాకు దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. కెవెంటర్స్ వంటి కంపెనీలు మన ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందున, మ‌నం వారికి మరింత మద్దతు ఇవ్వాలి అని వ్రాశారు.

కోల్డ్ కాఫీ మేము ఎలా తయారు చేస్తామో చూడండ‌ని రాహుల్ గాంధీని సిబ్బంది అడ‌గ‌గా.. వద్దు నేనే తయారు చేస్తానని బదులిచ్చారు. ఆ తర్వాత రాహుల్‌ గాంధీ పాలు, ఐస్‌క్రీమ్‌ వేసి మిక్సర్‌ నడుపుతూ.. కెవెంటర్స్‌ సిగ్నేచర్‌ బాటిల్‌లో కాఫీ పోశారు. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి స్టోర్ య‌జ‌మానుల‌తో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

రాహుల్ గాంధీ కెవెంటర్స్ సహ వ్యవస్థాపకులు అమన్ అరోరా, అగస్త్య దాల్మియాతో వ్యాపారం గురించి మాట్లాడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆ స‌మ‌యంలో కెవెంటర్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ పెట్టుబడి ప్రణాళికల గురించి అడిగాడు. దీనికి రాహుల్ గాంధీ నవ్వుతూ.. ‘‘నేను కెవెంటర్స్‌ని చూస్తూ పెట్టుబడి నిర్ణయం గురించి ఆలోచిస్తున్నాను అని బ‌దులిచ్చారు. రాహుల్ గాంధీ కెవెంటర్స్ వ్యవస్థాపకులను వారి వ్యాపార వృద్ధి, విస్తరణ ప్రణాళికల గురించి అడిగారు. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 మరియు టైర్ 4 నగరాలపై దృష్టి పెడుతున్నామని, టైర్ 1 నగరాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయని, ఇది తమకు సవాలుగా మారిందని అమన్ అరోరా, అగస్త్య దాల్మియా చెప్పారు.

దీని తర్వాత రాహుల్ గాంధీ దుకాణానికి వచ్చిన ఒక వృద్ధ మహిళతో కూడా మాట్లాడారు. ఆ మహిళ అదే భవనంలో నివసిస్తుందని చెప్పి వారిని తన ఇంటికి ఆహ్వానించింది. రాహుల్ గాంధీ నవ్వుతూ ‘రెండు నిమిషాల త‌ర్వాత‌ వస్తాను అని చెబుతారు. తీరా రాహుల్‌ ఇంటికి వెళ్లగా.. ఆ మహిళ తన వద్ద తాళాలు లేవని చెప్ప‌డం అక్క‌డున్న‌ అందరికి నవ్వు తెప్పిస్తుంది.

Next Story