కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. మే 31న ఆయన అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. పది రోజుల పాటు అక్కడే ఉంటారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మేడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో జరిగే ర్యాలీలో సుమారు 5,000 మంది ఎన్ఆర్ఐలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వాషింగ్టన్, కాలిఫోర్నియాలో జరిగే ప్యానలె డిస్కషన్‌లో పాల్గొనే ఆయన.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు ఇప్పటికే వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే..! రాహుల్ గత మార్చిలో కేంబ్రిడ్జి యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొని భారత ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రాహుల్ విదేశాల్లో కించపరచేలా మాట్లాడరని, విదేశీ శక్తుల జోక్యాన్ని కోరారని బీజేపీ ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని తాను కించపరచలేదని, బీజేపీ నేతలే అనేక సార్లు విదేశీ పర్యటనల్లో దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేశారని కౌంటర్ వేశారు.