పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత రాహుల్ గాంధీ విషయంలో లోక్‌సభకు అనర్హత వేటు పడింది. సోమవారం గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టులో తనకు పడిన శిక్షను సవాలు చేయనున్నట్లు ఆయన న్యాయవాది తెలిపారు. సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెలపాటూ గడువు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్ సభ సభ్యత్వం దక్కుతుంది. ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాలి. దీంతో రాహుల్ గాంధీ 8 ఏళ్లపాటూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోనున్నారు.
సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. న్యాయనిపుణులను సంప్రదించి ఇప్పటికే ఆయన వ్యాజ్యం తయారు చేశారు. ఈ కేసులో తనని దోషిగా నిర్దారిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెషన్స్ కోర్టు తీర్పు వెలువడే వరకు తనను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం.