రాహుల్, ప్రియాంక అక్కడికి వెళ్లొచ్చు

Rahul Gandhi, Priyanka Gandhi Vadra now allowed to visit Lakhimpur Kheri. ఉత్తర ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌లో నిరసన చేస్తున్న రైతులపై కారు దూసుకెళ్లిన

By Medi Samrat
Published on : 6 Oct 2021 3:29 PM IST

రాహుల్, ప్రియాంక అక్కడికి వెళ్లొచ్చు

ఉత్తర ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌లో నిరసన చేస్తున్న రైతులపై కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై ప్రతి పక్షాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. లఖీమ్‌పూర్‌​ ఖేర్‌ పర్యటనకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి యూపీ ప్రభుత్వం నుంచి అనుమతిని ఇచ్చింది. రాహుల్‌ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ వాద్రా, మరో ముగ్గురిని అనుమతిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అధికారులతో జరిపిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేతల బృందం ఢిల్లీ నుంచి బయలు దేరింది. రాహుల్‌ గాంధీ లఖీమ్‌పూర్‌ వెళ్లేందుకు పోలీసుల అనుమతి కోరగా అందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయంటూ మండిపడ్డారు. సీతాపూర్‌లో అరెస్టయిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గడిచిన రెండు రోజులుగా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. అనుమతి లభించేదాకా తాను సత్యాగ్రహం కొనసాగిస్తానని ప్రియాంక చెప్పారు. తాజాగా ఆమెకు కూ


Next Story