సిద్ధరామయ్యను ప‌రుగెత్తించిన‌ రాహుల్ గాంధీ

Rahul Gandhi makes Siddaramaiah sprint during Bharat Jodo Yatra. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఆయన యాత్రలో

By Medi Samrat  Published on  7 Oct 2022 11:59 AM IST
సిద్ధరామయ్యను ప‌రుగెత్తించిన‌ రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఆయన యాత్రలో పలువురు కాంగ్రెస్ నేతలు కూడా భాగమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తమ ట్విట్టర్‌ అకౌంట్స్ లో పలు వైరల్ వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది. మరో వైరల్ వీడియోలో రాహుల్ గాంధీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేయి పట్టుకుని ఆయన్ను పరిగెత్తించేలా చేయడం చూడవచ్చు. 75 ఏళ్ల సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పక్కన నడుస్తున్నారు. ఆ తర్వాత అకస్మాత్తుగా రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను పట్టుకుని పరుగులు తీయడం మొదలుపెట్టారు. వారు కలిసి దాదాపు 18 సెకన్ల పాటు పరుగెత్తారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కెసి వేణుగోపాల్ వారిని ఆగమని కోరడం వీడియోలో చూడవచ్చు. భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 30న కర్ణాటకకు చేరుకుంది. అక్టోబర్ 21 వరకు ఆ రాష్ట్రం గుండా కొనసాగుతుంది.

రెండు రోజుల విరామం తర్వాత భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం కాగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ పక్కన నడిచారు. సోనియా గాంధీతో పాటు మహిళా ఎమ్మెల్యేలు అంజలి నింబాల్కర్, రూపకళ, లక్ష్మీ హెబ్బాల్కర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story