బైక్‌పై అక్కడి వరకు రాహుల్ గాంధీ జ‌ర్నీ.. వీడియో.!

Rahul Gandhi Journey on a taxi bike in Goa. కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌ గాంధీ గోవాలో పర్యటిస్తున్నారు. ఒక్కరోజు పర్యటన కోసం రాహుల్‌ శనివారం గోవాకు

By అంజి  Published on  30 Oct 2021 4:13 PM IST
బైక్‌పై అక్కడి వరకు రాహుల్ గాంధీ జ‌ర్నీ.. వీడియో.!

కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌ గాంధీ గోవాలో పర్యటిస్తున్నారు. ఒక్కరోజు పర్యటన కోసం రాహుల్‌ శనివారం గోవాకు వెళ్లారు. పర్యటనలో భాగంగా రాహుల్‌.. దక్షిణ గోవాలోని వల్సావో విలేజ్‌లో మత్స్యకారులతో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం అజాద్ మైదాన్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించేందుకు.. రాహుల్‌ ట్యాక్సీ బైక్‌పై జర్నీ చేశారు. గోవాలో పైలట్‌ పేరుతో మోటార్‌ సైకిల్‌ ట్యాక్సీ సర్వీస్‌ నడుపుతుంటారు. అక్కడే బైక్‌ను అద్దెకు తీసుకున్న రాహుల్‌ గాంధీ దానిపై ప్రయాణం చేశారు. బైక్‌ను ఓ వ్యక్తి నడుపుతుంటే వెనకాలా రాహుల్‌ గాంధీ కూర్చున్నారు. పనాజీలోని బాంబోలిమ్‌ నుంచి అజాద్‌ మైదాన్‌లో గల అమరవీరుల స్థూపం వరకు వీరి ప్రయాణం సాగింది. రాహుల్‌ అక్కడి చేరుకున్న తర్వాత.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.


Next Story