రాహుల్ గాంధీకి కాస్త ఊరట

Rahul Gandhi gets bail till April 13. సూరత్ సెషన్స్ కోర్ట్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది.

By M.S.R  Published on  3 April 2023 8:08 PM IST
రాహుల్ గాంధీకి కాస్త ఊరట

Rahul Gandhi


సూరత్ సెషన్స్ కోర్ట్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీకి ఏప్రిల్ 13 వరకు బెయిల్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పరువునష్టం కేసులో తనను దోషిగా తేల్చి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులో సోమవారం సవాల్ చేశారు రాహుల్ గాంధీ. విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13వ తేదీన ఉంటుందని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై విచారణను మే 3వ తేదీన చేపట్టనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువు నష్టం దావాలో ఈ శిక్ష విధించింది. అదే రోజు కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. అతని శిక్ష అమలుపై 30 రోజుల స్టే విధించింది. పై కోర్టులో అప్పీల్ చేసుకోవటానికి అవకాశం కల్పించింది. ఈ తీర్పును నేడు సవాల్ చేశారు రాహుల్ గాంధీ.


Next Story