టీమిండియా ఓటమికి రాహుల్ గాంధీ చెప్పిన కారణం విన్నారా.?

వన్డే ప్రపంచకప్ లో టీమిండియా ఓటమిని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

By Medi Samrat  Published on  21 Nov 2023 2:25 PM GMT
టీమిండియా ఓటమికి రాహుల్ గాంధీ చెప్పిన కారణం విన్నారా.?

వన్డే ప్రపంచకప్ లో టీమిండియా ఓటమిని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమిండియా ఓటమికి గల కారణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి చెడు శకునం చేరుకోవడంతోనే టీమిండియా గెలిచే మ్యాచ్‌ కూడా ఓడిపోయిందని అన్నారు. టీవీలలో ఈ విషయాన్ని చూపించరని.. కానీ దేశ ప్రజలకు ఈ విషయం తెలుసని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనను టార్గెట్ చేసే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ మూడోసారి వరల్డ్‌కప్‌ని గెలవాలని కోరుకున్న క్రికెట్‌ అభిమానుల కల కలగానే మిగిలిపోయింది. ఆదివారం నాడు గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక 240 పరుగుల టార్గెట్‌ని ఆస్ట్రేలియా చాలా ఈజీగా ఛేదించింది. అయితే వరల్డ్‌ కప్‌ లీగ్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని భారత్‌ ఫైనల్‌లో ఓడిపోవడం అభిమానులకు బాధను కలిగిస్తోంది. భారత్ ఓటమికి ఒక్కొక్కరు.. ఒక్కో కారణం చెబుతున్నారు.

Next Story