విద్వేషంపై ప్రేమ గెలిచింది : రాహుల్ గాంధీ

Rahul Gandhi At Karnataka Oath Event. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

By Medi Samrat  Published on  20 May 2023 6:00 PM IST
విద్వేషంపై ప్రేమ గెలిచింది : రాహుల్ గాంధీ

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులుగా 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తుందని ఆ పార్టీ రాహుల్ గాంధీ తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని.. మేం 5 వాగ్దానాలు చేశాం, 2 గంటల్లో అమలు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలించదంటూ వివిధ విశ్లేషణలు జరిగాయి. నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు బాసటగా నిలవడం వల్లే కాంగ్రెస్ గెలుపు సాకారమైందని అన్నారు. మా వెంట నిజం ఉంది.. మా వెనుక పేద ప్రజలు ఉన్నారు. కానీ బీజేపీ దగ్గర డబ్బు ఉంది.. పోలీసులు ఉన్నారు.. ప్రతిదీ వారి దగ్గర ఉంది. కానీ కర్ణాటక ప్రజలు వారిని ఓడగొట్టారని రాహుల్ అన్నారు. విద్వేషంపై ప్రేమ గెలిచిందని రాహుల్ చెప్పుకొచ్చారు.

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నిక‌ల‌లో గెలిచ‌న‌ప్ప‌టి నుంచి సీఎం పదవిపై పట్టుదలతో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలు డాక్టర్ జి పరమేశ్వర, కెహెచ్ మునియప్ప, కెజె జార్జ్, ఎంబి పాటిల్, సతీష్ జార్కిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ లు సిద్ధ‌రామ‌య్య‌ మంత్రివర్గంలో ఉన్నారు.


Next Story