ఆపరేషన్ సింధూర్‌పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు. ఆపరేషన్ సింధూర్ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే పాక్‌కు తెలియజేశారని రాహుల్ అన్నారు. దీంతో బీజేపీ నేత అమిత్ మాలవీయ రాహుల్‌ను టార్గెట్ చేశారు.
అమిత్ మాల్వియా తన ఎక్స్ పోస్ట్‌లో రాహుల్ గాంధీ ఫోటోను పంచుకున్నారు. అందులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ముఖం సగం కనిపిస్తుంది. రాహుల్ గాంధీ తదుపరి అడుగు పాకిస్థాన్ అత్యున్నత గౌరవం 'నిషాన్-ఎ-పాకిస్థాన్' అందుకోవడమేనా అని ఆయన తన పోస్ట్‌లో ప్రశ్న లేవనెత్తారు.
అమిత్ తన పోస్ట్‌లో.. రాహుల్ గాంధీ పాకిస్తాన్ భాష, వారి శ్రేయోభిలాషుల భాష మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన భారీ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్‌కు ప్రధానిని రాహుల్ అభినందించలేదు. అదికాకుండా.. మనం ఎన్ని జెట్‌లను కోల్పోయామని వారు పదేపదే అడుగుతారు.. అయితే దీనికి సమాధానం ఇప్పటికే DGMO బ్రీఫింగ్‌లో ప్రస్తావించబడింది. ఘర్షణ సమయంలో ఎన్ని పాకిస్తాన్ జెట్‌లను కాల్చివేశారు.. భారత సైన్యం పాక్ వైమానిక స్థావరాలపై బాంబు దాడిలో ఎన్ని విమానాలు ధ్వంసమయ్యాయని ఒక్కసారి కూడా అడగలేదని దుయ్యబట్టారు.