ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశా గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాస్ జంషెడ్‌పూర్ తూర్పు నుంచి పోటీ చేస్తారనే చర్చ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచన వాయిదా పడింది. అతని కోడలు అక్కడి నుండి పోటీకి దిగారు.
రాష్ట్రపతి భవన్ నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం.. రఘుబర్ దాస్ రాజీనామాను భారత రాష్ట్రపతి అధికారికంగా ఆమోదించారు. ఒడిశాలో ఆయన వారసుడిగా ప్రస్తుత మిజోరం గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి నియమితులయ్యారు. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత రఘుబర్ దాస్ అక్టోబర్ 18, 2023న ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు.