పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న పీవీ సింధు..!

PV Sindhu awarded the padma bhushan. హైదరాబాద్‌కు చెందిన వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను

By అంజి  Published on  8 Nov 2021 7:02 AM GMT
పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న పీవీ సింధు..!

హైదరాబాద్‌కు చెందిన వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను ప్రకటించిన అవార్డులను ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందించారు. ఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి కోవింద్‌ చేతుల మీదుగా పీవీ సింధు అవార్డును అందుకున్నారు. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో పీవీ సింధు సిల్వర్‌ పతకం గెల్చుకుంది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్‌ పతకం గెల్చుకుంది. అంతకుముందు 2015వ సంవత్సరంలో పీవీ సింధుకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఈ సంవత్సరం 119 పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనిలో ఏడు పద్మ విభూషణ్‌, 10 పద్మ భూషణ్‌ ఉండగా 102 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. వైద్యరంగంలో ఎయిర్‌ మార్షల్‌ డాక్టర్‌ పద్మ భందోపాధ్యాయ పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. మరో 16 మందికి మరణించిన తర్వాత అవార్డులు ఇచ్చారు. పద్మ శ్రీ అవార్డులు అందుకున్న వారిలో ఓ ట్రాన్స్‌ జెండర్‌ కూడా ఉన్నారు. పద్మ అవార్డు అందుకున్న వారిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, నిర్మాత కరణ్‌ జోహర్‌, నిర్మాత ఏక్తా కపూర్‌, గాయకుడు అద్నాన్‌ సమీలు రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. మరణించిన తర్వాత అవార్డులు అందుకున్న వారిలో అరుణ్‌ జైట్లీ పద్మ విభూషణ్‌, సుష్మా స్వరాజ్‌ పద్మ భూషణ్‌లు ఉన్నారు.

Next Story