ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్ ధామి

Pushkar Dhami takes oath as Uttarakhand CM for second consecutive term. పుష్కర్ సింగ్ ధామి బుధవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

By Medi Samrat  Published on  23 March 2022 3:17 PM IST
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్ ధామి

పుష్కర్ సింగ్ ధామి బుధవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. త‌ద్వారా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా వ‌రుస‌గా రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టి స‌రికొత్త రికార్డు సృష్టించారు. డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా సిఎం మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సిఎం జైరాం ఠాకూర్ కూడా ధామీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వారిలో ఉన్నారు. 1990లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపి)తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ధామీ.. అంచెలంచెలుగా ఎదిగారు. పుష్కర్ సింగ్ ధామి చేత‌ ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.








Next Story