మినిస్టర్.. వీడియో కాల్ లో పాడు పనులు

పంజాబ్ మంత్రి బాల్కర్ సింగ్ ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వేధించారంటూ బీజేపీ ఆరోపించింది.

By Medi Samrat  Published on  28 May 2024 7:28 AM IST
మినిస్టర్.. వీడియో కాల్ లో పాడు పనులు

పంజాబ్ మంత్రి బాల్కర్ సింగ్ ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వేధించారంటూ బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఓ అభ్యంతరకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియో గురించి తనకు ఏ మాత్రం తెలియదని మంత్రి కొట్టిపారేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోను పలువురు బీజేపీ నేతలు సోమవారం షేర్ చేశారు. వీడియోలో, బాల్కర్ సింగ్ అనే వ్యక్తి, ఉద్యోగం కోసం ఆయన్ను సంప్రదించిన ఒక మహిళకు తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ ఉన్నాడు. వీడియో కాల్‌లో మంత్రి మహిళను బట్టలు విప్పమని బలవంతం చేశారని, తన ప్రైవేట్ పార్ట్‌లను కూడా ఆమెకు చూపించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటన పై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) బాల్కర్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది.

Next Story