మంత్రిని కేబినెట్ నుంచి తొలగించిన సీఎం.. ఆ వెంటనే అరెస్ట్..
Punjab minister arrested after CM Bhagwant Mann sacks him over corruption charges. అవినీతి ఆరోపణలపై రాష్ట్ర కేబినెట్ నుంచి ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను తొలగించినట్లు
By Medi Samrat Published on 24 May 2022 3:21 PM ISTఅవినీతి ఆరోపణలపై రాష్ట్ర కేబినెట్ నుంచి ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను తొలగించినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. అతనిని తొలగించిన వెంటనే సింగ్లాను ఏసీబీ అరెస్టు చేసింది. ఈ మేరకు "నేను ఆ మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాను, అతనిని క్యాబినెట్ నుండి తొలగించి, అతనిపై కేసు నమోదు చేయమని పోలీసులను ఆదేశిస్తున్నాను. ఆ మంత్రి విజయ్ సింగ్లా. అతను తన శాఖలో అవినీతికి పాల్పడ్డాడు. దానిని అతను అంగీకరించాడు. అవినీతి రహిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు ఆప్ ప్రభుత్వం కట్టుబడి ఉందని" భగవంత్ మాన్ అన్నారు.
अरविंद केजरीवाल के "भ्रष्टाचार विरोधी मॉडल" के तहत AAP सरकार की बड़ी कार्रवाई
— AAP (@AamAadmiParty) May 24, 2022
🔹CM @BhagwantMann ने स्वास्थ्य मंत्री विजय सिंगला को किया बर्ख़ास्त
🔹अधिकारियों से ठेके पर 1 पर्सेंट कमीशन की मांग का लगा था आरोप
🔹AAP सरकार भ्रष्टाचार मुक्त भारत बनाने के लिए वचनबद्ध है pic.twitter.com/5HkaTU2Cxm
''మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాను. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నాను'' అని ముఖ్యమంత్రి వీడియో సందేశంలో పేర్కొన్నారు. అతనిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. టెండర్ల కోసం మంత్రి ఒక శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుసుకున్న భగవంత్ మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సింగ్లా తప్పులను అంగీకరించాడని మన్ పేర్కొన్నాడు. రాష్ట్రంలోని గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మన్.. అవినీతిపరులకు రక్షణగా నిలిచారని అన్నారు. అయితే, ఇప్పుడు పంజాబ్‌లో అలాంటి విధానాలను సహించేది లేదని ఆయన అన్నారు.
"ప్రతి టెండర్‌కు 1 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్న నా ప్రభుత్వంలోని ఒక మంత్రిపై నాకు తెలిసిన ఒక కేసు వచ్చింది. నేను దానిని చాలా సీరియస్‌గా తీసుకున్నాను. దాని గురించి ఎవరికీ తెలియదు. నేను కోరుకుంటే, నేను దానిని చాపకింద తోసేసి ఉండేవాడిని. కానీ నన్ను నమ్మిన ప్రజల నమ్మకాన్ని నేను వమ్ము చేయను "అని సీఎం చెప్పారు.