ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం : వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులకు బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ..

Punjab makes double-dose vaccination mandatory for entry into public places from January 15. ఓమిక్రాన్ వేరియంట్‌పై పెరుగుతున్న ఆందోళన నేఫ‌థ్యంలో

By Medi Samrat  Published on  29 Dec 2021 9:30 AM IST
ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం : వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులకు బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ..

ఓమిక్రాన్ వేరియంట్‌పై పెరుగుతున్న ఆందోళన నేఫ‌థ్యంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు జనవరి 15 నుండి రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడరని పంజాబ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. వ్యాక్సినేషన్ రెండు డోసులు ఇంకా తీసుకోని వారందరూ తమ నివాసాల్లోనే ఉండాలని.. బహిరంగ ప్రదేశాలు, మార్కెట్‌లు, ఫంక్షన్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మరియు మతపరమైన ప్రదేశాలకు వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

కొవిడ్‌-19 మహమ్మారి సమాజానికి పెద్ద సవాలుగా మారింద‌ని.. ప్రతి వ్యక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేసిందని అందరికీ తెలుసు. ముఖ్యంగా కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కారణంగా అత్యవసర సమస్యలను పరిగణలోకి తీసుకుంటాం. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి.. పూర్తిగా టీకాలు వేయడం అవసరం అని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

జనవరి 15 నుంచి అమ‌లుచేసే ఆంక్షలు :

1. సబ్జీ మండి, ధాన్యం మార్కెట్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, పార్కులు, మతపరమైన ప్రదేశాలు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హాట్‌లు, స్థానిక మార్కెట్‌లు, పెద్ద సమావేశాలు ఉండే బహిరంగ ప్రదేశాలలో రెండు డోసుల‌ టీకాలు తీసుకున్న పెద్ద‌ల‌ను మాత్రమే అనుమతిస్తుంది.

2. చండీగఢ్‌లో ఉన్న అన్ని ప్రభుత్వ/బోర్డు/కార్పొరేషన్ కార్యాలయాలలో రెండు డోసుల‌ టీకాలు తీసుకున్న ఉద్యోగులు, వయోజనల‌ను మాత్రమే అనుమతిస్తారు.

3. హోటల్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్‌లు ఆరోగ్య ప్రోటోకాల్ ప్రకారం.. రెండు డోసుల‌ టీకాలు తీసుకున్న వారిని మాత్రమే అనుమతించాలి.

4. ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండూ కూడా రెండు డోసుల‌ వ్యాక్సిన్ పొందిన వ్య‌క్తుల‌కు (వారి ఉద్యోగులతో సహా) లేదా రెండవ డోస్ తీసుకోని వారికి మాత్రమే అనుమతిస్తాయి. తదనుగుణంగా బ్యాంకులకు ఈ సూచనలు ఇవ్వవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.




Next Story