పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తన రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. పెట్రోల్ పై 10 రూపాయలు, డీజిల్ పై 5 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది. లీటరు పెట్రోల్ పై రూ. 5, లీటరు డీజిల్ పై రూ. 10 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో కూడా పెట్రోలు, డీజిల్ ధరలపై పన్నులను స్వల్పంగా తగ్గించాయి. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ధరలు తగ్గించాయి. పంజాబ్ రాష్ట్రం కూడా ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది.
దీపావళి సందర్భంగా ఇంధన ధరలను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న చర్యల తర్వాత కాంగ్రెస్ పాలిత పంజాబ్ పెట్రోల్ మరియు డీజిల్‌పై భారీగా అదనపు తగ్గింపును ఇచ్చింది. ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ పంజాబ్‌లో పెట్రోల్ మన దగ్గర చౌకగా మారింది. ఢిల్లీతో పోలిస్తే, పంజాబ్‌లో ఇప్పుడు పెట్రోల్ 9 తక్కువగా ఉంది అని ముఖ్యమంత్రి చెప్పారు. పంజాబ్‌లో ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు ₹ 96.16 మరియు డీజిల్ లీటరుకు ₹ 84.80 ఉంది.