పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ మధ్య 'డిజిటల్ వార్'

Punjab Congress Tweets Video Showing Channi as thor. ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య ఘర్షణే ప్రధానాంశంగా భావిస్తున్

By Medi Samrat  Published on  25 Jan 2022 9:12 AM GMT
పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ మధ్య డిజిటల్ వార్

ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య ఘర్షణే ప్రధానాంశంగా భావిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారం కూడా డిజిటల్ వార్ గా నడుస్తోంది. భగవంత్‌కు అనుకూలంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పూఫ్ వీడియోను విడుదల చేసిన నేఫ‌థ్యంలో.. పంజాబ్ కాంగ్రెస్ కూడా తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని సూపర్ హీరో 'థోర్'గా చిత్రీకరించారు. పంజాబ్ కాంగ్రెస్ హ్యాష్‌ట్యాగ్ 'కాంగ్రెస్ హాయ్ ఆయేగీ' 34 సెకన్ల వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' సినిమాలోనిది. సినిమాలో థోర్ తన భాగస్వామిని గ్రహాంతరవాసుల దాడి నుండి రక్షించడానికి వస్తాడు.

ఇదిలావుంటే.. ఇసుక మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి చన్నీపై మాజీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియా ఆరోపణలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ వీడియోను షేర్ చేసింది. ఆప్ గత వారం ఓ స్పూఫ్ వీడియోను విడుదల చేసింది. ఆప్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సీఎం కుర్చీ కోసం గొడవ పడుతున్న‌ట్లు ఉంది. అలాగే.. భగవంత్‌ మన్‌కు పంజాబ్‌ ప్రజలు ఘనస్వాగతం పలికి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇక‌ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 20న జరగనుండగా.. ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి.



Next Story