పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ సింగ్ గురువారం పెళ్లి చేసుకోనున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో రెండో వివాహం చేసుకుంటున్నారు. చండీగఢ్‌లోని ఆయన నివాసంలో జరుగనున్న ఈ ప్రైవేట్ వేడుకకు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు. సీఎం భగవంత్ మాన్ సింగ్‌కు ఇది వరకు ఇందర్‌ప్రీత్ కౌర్‌తో పెళ్లయింది. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే ఆరేళ్ల వివాహ బంధం తర్వాత మొదటి భార్య ఇందర్‌పీత్ర్ కౌర్, ఆయన విడిపోయారు. భగవంత్ మాన్‌కు తొలి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.
ఆయన మరో పెళ్లి చేసుకోవాలని తల్లి, సోదరి సూచించారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని తల్లి, చెల్లెలు కోరడం వల్లే భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తల్లి, చెల్లెలే ఈ సంబంధం తీసుకొచ్చినట్లు సమాచారం. వారిద్దరికి తెలిసిన వైద్యురాలు గురుప్రీత్ కౌర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. దీంతో గురువారం చండీగఢ్‌లోని భగవంత్ మాన్ సింగ్ నివాసంలో గురుప్రీత్ కౌర్‌తో ఆయన రెండో పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేటుగా జరుగనున్నది. ఈ పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పంజాబ్ మంత్రులు, సన్నిహితులు హాజరుకానున్నారు.