డాక్ట‌ర్‌ను పెళ్లాడిన పంజాబ్‌ ముఖ్య‌మంత్రి

Punjab CM Bhagwant Mann got married in a private ceremony today. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈరోజు చండీగఢ్‌లోని తన నివాసంలో

By Medi Samrat  Published on  7 July 2022 5:22 PM IST
డాక్ట‌ర్‌ను పెళ్లాడిన పంజాబ్‌ ముఖ్య‌మంత్రి

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈరోజు చండీగఢ్‌లోని తన నివాసంలో డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన 2015లో తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. 1993లో జన్మించిన గురుప్రీత్ కౌర్‌తో 48 ఏళ్ల భగవంత్ మాన్ వివాహ వేడుకకు పంజాబ్ సీఎం తల్లి, సోదరి, బంధువులు, కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో పాటు ఆప్ సీనియర్ నాయకుడు మరియు రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌కు ఇది వరకు ఇందర్‌ప్రీత్ కౌర్‌తో పెళ్లయింది. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే ఆరేళ్ల వివాహ బంధం తర్వాత మొదటి భార్య ఇందర్‌పీత్ర్‌ కౌర్‌, ఆయన విడిపోయారు. భగవంత్‌ మాన్‌కు తొలి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఆయన మరో పెళ్లి చేసుకోవాలని తల్లి, సోదరి సూచించారు. తల్లి, చెల్లెలే ఈ సంబంధం తీసుకొచ్చినట్లు సమాచారం. వారిద్దరికి తెలిసిన వైద్యురాలు గురుప్రీత్‌ కౌర్‌ను ఎంపిక చేశారు.







Next Story