'నకిలీ' ప్రభుత్వ అధికారులపై చర్యలకు సిద్ధమైన సీఎం
Punjab CM Bhagwant Mann announces action against government officials with fake degrees. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎన్నికల సమయంలో ఎన్నో ప్రకటనలు
By Medi Samrat Published on 11 Jun 2022 9:15 PM ISTపంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎన్నికల సమయంలో ఎన్నో ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అధికారం చేపట్టినప్పటి నుండి ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నారు. తాజాగా నకిలీ సర్టిపికేట్‌లతో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారిపై వేటువేసేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగాల్లో ఉన్నవారు రాజకీయ నాయకుల బంధువులైనా, ఇతర ఏ పలుకుబడి ఉన్న వారైనా చర్యలు తీసుకుంటామని సీఎం భగవంత్ మాన్ శనివారం ప్రకటించారు. అటువంటి ఉద్యోగులు, నాయకుల బంధువులను పేర్లను త్వరలో బయటపెట్టబోతున్నట్లు సీఎం భగవంత్ మాన్ ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు.
ਮੇਰੇ ਧਿਆਨ ਚ ਬਹੁਤ ਕੇਸ ਆਏ ਨੇ ਕਿ ਬਹੁਤ ਹੀ ਰਸੂਖਦਾਰ ਅਤੇ ਰਾਜਨੀਤਕ ਲੋਕਾਂ ਦੇ ਰਿਸ਼ਤੇਦਾਰ ਜਾਅਲੀ ਡਿਗਰੀਆਂ ਨਾਲ ਸਰਕਾਰੀ ਨੌਕਰੀਆਂ ਲੈ ਕੇ ਬੈਠੇ ਨੇ..ਜਲਦੀ ਹੀ ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਦੇ ਟੈਕਸ ਦੇ ਇੱਕ -ਇੱਕ ਪੈਸੇ ਦਾ ਹਿਸਾਬ ਲੋਕਾਂ ਸਾਹਮਣੇ ਰੱਖਿਆ ਜਾਵੇਗਾ…
— Bhagwant Mann (@BhagwantMann) June 11, 2022
చాలా కేసులు నా దృష్టికి వచ్చాయి.. చాలా ప్రభావవంతమైన, రాజకీయ వ్యక్తుల బంధువులు నకిలీ డిగ్రీలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని సీఎం మాన్ ట్వీట్ చేశారు. త్వరలో పంజాబ్ ప్రభుత్వం ప్రజల సొమ్మును లెక్కలోకి తీసుకుంటుందని.. అలాంటి వారిని బయటపెడతామని ఆయన సూచించారు. పంజాబ్ ప్రజలు పన్ను రూపంలో కట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా వారి ఖాతాలోకి వెళ్తుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.
ఇటీవల పంజాబ్ స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ అమన్‌దీప్ సింగ్ రిక్రూట్‌మెంట్‌లో మోసం వెలుగులోకి రావడం గమనార్హం. దీనిపై చర్య తీసుకున్న పంజాబ్ ప్రభుత్వం అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది. అలాంటి మరిన్ని కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో అనర్హులను తొలగించి అర్హులైన వారిని నియమించే విధంగా పంజాబ్ ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. ఇదే జరిగితే పంజాబ్ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.