పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా పడ్డాయి. గురు రవిదాస్ జయంతి సందర్భంగా పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే దశలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను సోమవారం వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి నెలలోనే 20వ తారీఖున నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి దృష్ట్యా రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు ఈసీని ఆశ్రయించాయి.
గురు రవిదాస్ జయంతి దృష్ట్యా ఆయన లక్షలాది మంది అనుచరులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి జయంతోత్సవాలలో పాల్గొనడానికి వెళుతారు. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, బీజేపీ, దాని మిత్రపక్షాలు, బీఎస్పీ ఓటింగ్ తేదీని వాయిదా వేయాలని ఎన్నికల ప్యానెల్‌ను కోరారు. దీంతో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ పోలింగ్ జరుగుతుంది.