పంజాబ్ డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రా

Punjab appoints IPS officer Viresh Kumar Bhawra as new DGP. పంజాబ్‌ రాష్ట్ర కొత్త పోలీసు చీఫ్‌గా ఐపీఎస్‌ అధికారి వీరేష్‌ కుమార్‌ భవ్రాను

By -  Medi Samrat
Published on : 8 Jan 2022 5:17 PM IST

పంజాబ్ డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రా

పంజాబ్‌ రాష్ట్ర కొత్త పోలీసు చీఫ్‌గా ఐపీఎస్‌ అధికారి వీరేష్‌ కుమార్‌ భవ్రాను పంజాబ్‌ ప్రభుత్వం శనివారం నియమించింది. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మూడు నెలల వ్యవధిలో రాష్ట్రంలో మూడో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి కనీసం రెండేళ్ల వరకూ అత్యున్నత పదవిలో ఉండనున్నారు. ఎంపానెల్‌మెంట్ కమిటీ ముగ్గురు అధికారులైన భావ్రా, రాష్ట్ర మాజీ పోలీసు చీఫ్ దినకర్ గుప్తా, ఐపీఎస్ అధికారి ప్రబోధ్ కుమార్‌లను అత్యున్నత పదవికి సిఫార్సు చేసినట్లు పంజాబ్ గవర్నర్ ఒక ఉత్తర్వులో తెలిపారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ వీరేష్‌ కుమార్‌ భవ్రా పంజాబ్‌ డీజీపీగా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పంపిన ప్యానల్‌లో దినకర్‌ గుప్తా, వీరేష్‌ కుమార్‌ భవ్రా, ప్రబోద్ కుమార్‌ల పేర్లను ప్రతిపాదించగా.. వీకే భవ్రాను కొత్త డీజీపీగా నియమించింది కేంద్రం. ప్రధానికి రక్షణ చేపట్టడంలో విఫలమైన పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయపై వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రాను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించడానికి కొన్ని గంటల ముందే ఆ రాష్ట్రంలో కొత్త డీజీపీని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్‌లో 100 రోజుల వ్యవధిలో డీజీపీ మార్పు చోటుచేసుకోవడం ఇది మూడోసారి.


Next Story