బట్టలు మంచిగా వేసుకోవాలంటూ హైదరాబాద్ టెకీకి పుదుచ్చేరి పోలీసుల సూచనలు.. రికార్డు చేస్తున్నారని తెలియడంతో..

Puducherry Police grill Hyderabad girls for ‘inappropriate' dressing. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ యువ టెక్కీ తన పుదుచ్చేరి(పాండిచ్చేరి) పర్యటనలో

By Medi Samrat  Published on  28 Feb 2022 8:16 PM IST
బట్టలు మంచిగా వేసుకోవాలంటూ హైదరాబాద్ టెకీకి పుదుచ్చేరి పోలీసుల సూచనలు.. రికార్డు చేస్తున్నారని తెలియడంతో..

హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ యువ టెక్కీ తన పుదుచ్చేరి(పాండిచ్చేరి) పర్యటనలో ఉన్నప్పుడు మోరల్ పోలీసింగ్‌ బాధితురాలైంది. ప్రణితతో సహా టెక్కీల బృందం విహారయాత్ర కోసం పుదుచ్చేరికి వెళ్లారు. శనివారం తనను, తన స్నేహితులను స్థానిక పుదుచ్చేరి పోలీసులు హెచ్చరించారని ఆమె ఆరోపించింది. సరైన దుస్తులు ధరించాలని చెబుతూ పోలీసుల నుంచి తనకు 'డ్రెస్సింగ్ పాఠం' వచ్చిందని ప్రణిత ఆరోపించింది. ఆమె, ఆమె స్నేహితులు ఫోటోలు తీస్తుండగా, ఫ్రెంచ్ కాలనీ సమీపంలో తమ డ్రెస్సింగ్ విషయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒక పోలీసు కూడా తన కేరెక్టర్ ను ప్రశ్నించాడని ఆమె ఆరోపించింది.

పాండిచ్చేరి టూరిస్ట్ ప్లేస్ అని, విదేశీయులు కూడా చాలా మంది వస్తుంటారు.. అలాగే ఫారినర్స్ ని కూడా ఆపారా అని పోలీసులను అడిగాననీ వారు సమాధానం చెప్పలేదని ప్రణీత తెలిపింది. అమ్మాయిల డ్రెస్సింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు.. ఇలాంటి దుస్తులు ధరించడానికి అనుమతి లేదని చెప్పారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు పోలీసులు యువతులను బెదిరిస్తున్న వీడియోను ఆ బృందం రికార్డ్ చేసింది.

"పోలీసు మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తానని బెదిరించాడు, మేము ఏ తప్పు చేశామో చెబితే పోలీసు స్టేషన్ కు వెళ్ళడానికి సిద్ధమేనని అన్నాం. వాళ్లు అలా చేయడానికి ముందుకు రాలేదు. కానీ మమ్మల్ని నిందించాడు. ఎలా దుస్తులు ధరించాలో మోరల్ సైన్స్ లెక్చర్ ఇచ్చాడు. మేము మా హక్కులను వివరించడానికి ప్రయత్నించాము, కానీ అతను వినడం లేదు" అని ప్రణిత ఒక వీడియోలో తెలిపింది. పోలీసులు ఇద్దరూ మొదట దాదాపు 15 నిమిషాల పాటు తమను అనుసరించారని, తర్వాత వారు గ్రూప్‌ను ఆపి తన స్నేహితుల్లో ఒకరి మొబైల్ నంబర్, ఇతర వివరాలను అడిగారని ప్రణిత పేర్కొంది. ఈ ఘటనను రికార్డు చేస్తున్నామని తెలుసుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Next Story